సి.సి డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

*ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్

*సీసీ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
నందిగామ పట్టణంలోని 7 వ వార్డు సిద్ధార్థ నగర్ లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ పట్టణంలో పెద్ద ఎత్తున సిసి డ్రైనేజీలు నిర్మాణాలు చేపట్టామని , రూ.10 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించి మేజర్ డ్రైనేజీల నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశామని , రానున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యత క్రమంలో మిగిలిన డ్రైనేజీల నిర్మాణాలు కూడా చేపట్టామని తెలిపారు ,

అదేవిధంగా పట్టణంలోని 7వ వార్డు లో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని , ఎన్నో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు , పలు వార్డుల నుండి వచ్చిన మురుగునీరు 7 వ వార్డులో ఇళ్ల మధ్య నుండి ప్రవహిస్తూ ఉండటంతో మేజర్ డ్రైనేజ్ కూడా నిండి ఇళ్లలోకి మురుగు నీరు వచ్చే పరిస్థితి నెలకొందని నందిగామలో పలు ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం తీరలేదని , నేడు ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఆధునిక పద్ధతిలో సీసీ డ్రైనేజ్ నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు , ఏళ్లతరబడి ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే విధంగా శంకుస్థాపన నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి 7 వ వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ,

ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఇన్చార్జ్ చైర్మన్ మాడుగుల నాగరత్నం , కమిషనర్ డాక్టర్ జయరామ్ ,ఏఈ ఫణి శ్రీనివాస్ మరియు వైసీపీ పట్టణ అధ్యక్షుడు దొంతి రెడ్డి దేవేందర్ రెడ్డి ,కౌన్సిల్ సభ్యులు -వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular