గడపగడపలో ఇచ్చిన ఎమ్మెల్యే హామీ అమలయ్యేనా…
హామీ ఇచ్చి మూడు నెలలు గడిచిన ఆ ఊసే లేదంటున్న గ్రామ ప్రజలు…
వర్షాకాలం వచ్చిందంటే చాలు బుక్కాయ పల్లి గ్రామంలోని ఎర్రబల్లి రహదారి బురదమయంగా మారి నడవడానికి నరక ప్రాయంగా మారుతుంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ని గ్రామ ప్రజలు రోడ్డు వేయాలని నిలదీయడంతో రోడ్డు వెయ్యాలని అధికారులను స్థానిక నాయకులు ఆదేశించి మూడు నెలలుగా వస్తున్న ఇప్పటికే మోక్షం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నిత్యం వేలాదిమంది ఆ రహదారి వెంట తిరుగుతూ, అనేకమంది బురదలో జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, విధిలేని పరిస్థితిలో ఎన్నో సంవత్సరాలుగా బురదరోడ్ లోనే రాకపోకలు కొనసాగిస్తున్నామని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బురదతో దోమలు ఎక్కువ వ్యాప్తి చెంది వ్యాధులకు గురవుతున్నమని ప్రజలు వాపోతున్నారు. వర్షం వచ్చిందంటే చాలు కనీసం నడవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొందని ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు భరించాలని, అధికారులు ఎమ్మెల్యే హామీ మేరకు రోడ్డు వేసేందుకు చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.