మైదుకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సౌమ్యుడు ,ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షుడు సూరిశెట్టి ప్రసాద్ గుప్తాను ఆర్యవైశ్య కమిటీ, ఆర్య వైశ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం మాజీ అధ్యక్షుడు రెడ్డయ్య శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలను అప్పగించారు. శ్రేయోభిలాషులు ,స్నేహితులు, సన్నిహితులు ,ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున శాలువా పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెండేకంటి కుమార్, సునీల్ రాజా ,హరి, దొంతు సుబ్రహ్మణ్యం, వెంకటసుబ్బయ్య ,శ్రీధర్, రామకృష్ణ ,ఎలిశెట్టి ప్రసాద్, వెంకటేశ్వర్లు శేషు తదితరులు పాల్గొన్నారు.
మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులుగా సూరిశెట్టి ప్రసాద్ గుప్తా
RELATED ARTICLES