ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా సత్య కుమార్ యాదవ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు బీరం విద్యా సంస్థల చైర్మన్ సుబ్బారెడ్డిని శాలువా పూల మాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి పార్టీలో కష్టపడే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన అతి తక్కువ కాలంలోనే 3600 సభ్యత్వాలు చేపించడం హర్షించదగ్గ విషయం అన్నారు. సిద్ధాంతాన్ని నమ్మడంతోనే బిజెపి పార్టీ తనను గుర్తించి ఈ స్థాయికి ఎదిగేలా చేసిందన్నారు. జీవితంలో పార్టీలో నిబద్ధతతో పనిచేసే వారు ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారన్నారు. అధిష్టానం అప్పగించిన పనిని చిత్తశుద్ధితో నిబద్ధతతో చేసేవారికి ఎల్లప్పుడు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో వీరం విద్యాసంస్థల చైర్ పర్సన్ సరస్వతి,మా డైరెక్టర్ స్వాతి, శ్రీకాంత్, ప్రిన్సిపల్ శ్వేత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బీరం సుబ్బారెడ్డిని సత్కరించిన వైద్యశాఖ మంత్రి సత్య కుమార్..
RELATED ARTICLES