ఒక అవకాశం ఇవ్వండి అన్ని కష్టాలు తీరుస్తా...పుట్టా సుధాకర్ యాదవ్
తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలోని కేశలింగాయ పల్లి లో చేపట్టారు.వైసీపీ ప్రభుత్వ అరాచకాలు అసమర్థత ను ప్రజలకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ యాదవ్ వివరించారు. మైదుకూరు మున్సిపాలిటీ ఒకటో వార్డు కేశలింగయ పల్లి పరిధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ కష్టాలను టిడిపి అభ్యర్థి సుధాకర యాదవ్ కు ఏకరువు పెట్టారు గ్యాస్, కిరాణా సరుకులు అధిక సంఖ్యలో పెరిగాయని, మూడు సంవత్సరాల నుండి గ్రావెల్ వేసి రోడ్డు వేయలేదని, కారును బాడుగలకు తిప్పుకునేందుకు తీసుకుంటే రేషన్ కార్డు కట్ చేశారని, పెన్షన్లు రావడం లేదని, ఇల్లు మంజూరు చేయలేదని, ఇంటి స్థలాలు ఇవ్వలేదంటూ అనేక సమస్యలను ప్రజలు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ యాదవ్ కు వివరించారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరి కష్టాలు తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేశలింగయ్య పల్లెలో ప్రధానంగా పండే పంట పసుపు అని వాటిని కొనుగోలు చేయడం లేదని దానివల్ల అధికంగా నష్టపోయామని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు . కష్టాల నుండి మీరు బయటపడాలంటే నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కేశలింగాయపల్లె ఒకటో వార్డు ఇన్చార్జ్ ఎరూకలయ్యా పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.