పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు
భారత్ న్యూస్
మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డులో అంగన్వాడీ పాఠశాలకు వెళ్లేదారిని ఒక మహిళ ఆ పాఠశాలకు రహదారి లేదంటూ పాఠశాలను మూసేయాలంటూ ఆ పాఠశాల దారిన వచ్చే పిల్లలను కొడుతూ, అక్కడి టీచర్లను కొడుతూ నానా హంగామా చేస్తుంది. ఇదే విషయంపై అంగన్వాడి పాఠశాల కార్యకర్త ,స్థానిక కౌన్సిలర్ యపరాల లక్ష్మిదేవి మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు ,ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారికి, ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు అయినా ఫలితం లేదు. ఆ మహిళ పాఠశాల రహదారిని స్తంభాల అడ్డుగా చేసి మూసేస్తుంటే స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ ఇంటిని నిర్మిస్తానంటూ మహిళా పునాదులు తీస్తోంది. ఇప్పటికైనా అధికారులు నాయకులు స్పందించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.