మైదుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కేర్ క్లబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రియేటివ్ డ్రాయింగ్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కరెడ్ల క్రిష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు విద్యార్థుల పైన ఆధారపడి ఉందని, పిల్లలందరూ శారీరక,మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థి దశనుండి కష్టపడి పిల్లలందరూ అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. కేర్ క్లబ్ ఫౌండేషన్ చైర్మన్ సయ్యద్ యాసిన్ ట్రస్ట్ సభ్యులు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడంలో భాగస్వాములు కావడం పట్ల వారిని అభినందించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుభద్రమ్మ మాట్లాడుతూ మా విద్యార్థులకు కేర్ క్లబ్ ఫౌండేషన్ వారు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఓబులేసు గారు మాట్లాడుతూ విద్యార్థులు తమ ప్రతిభను సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు మంచిదని వాటికి తోడ్పాటు అందించిన ట్రస్టు సభ్యులను అభినందించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కరెడ్ల కృష్ణ చేతుల మీదుగా మెడల్, ట్రోఫీ,సర్టిఫికెట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు నారాయణమ్మ, విద్యార్థిని విద్యార్థులు, ట్రస్టు సభ్యులు శివ,కొండయ్య,సందీప్, వెంకటేష్, గౌస్,బ్రహ్మేంద్ర లు పాల్గొన్నారు.