ఎస్ టి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలి… ఎస్ఎఫ్ఐ – డివైఎఫ్ఐ

ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిరసన
మైదుకూరు పట్టణంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు లేకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, భారత యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు సాయంకాలం మూడు గంటల సమయంలో విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ….
గతంలో నుండి పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టిమిట్టులాడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా గతంలో అన్ని సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేకపోవడం వలన దాదాపు 12 మంది విద్యార్థులు ఫెయిల్ అవడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలు తెరిచి 10 రోజులు అవుతున్న అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరని కేవలం ముగ్గురు మాత్రమే ఈరోజు ఉపాధ్యాయులు వచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూడో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఇక్కడ ఉన్నారని అయితే ఉపాధ్యాయుల కొరత వలన దాదాపు 30 మంది విద్యార్థులు వారి తల్లదండ్రులు వచ్చి టి సి లు తీసుకొని పోవడం జరిగిందన్నారు. రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేని కారణంగా ఉన్న ఇంఛార్జి ప్రిన్సిపాల్ పట్టీ పట్టనట్లు వివరిస్తున్నాడని వారు వ్యక్తం చేస్తూ 200 మంది విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయుడు ఉండడం వలన విద్య బోధన ఎలా సాధ్యమవుతుందని వారు ప్రశ్నించారు. స్కూల్స్ ప్రారంభమై 10 రోజులు విద్యార్థులకు అందించే మెను ఇంతవకు అందించలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉపాధ్యాయులను అన్ని సబ్జెక్టులకు నియమించాలని అలాగే విద్యార్థులకు పౌష్టి ఆహారం అందించాలని రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియమించాలని వారు తెలియజేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రెబ్బ నరసింహ, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular