అమరవీరుల స్పూర్తితో పోరాడుదాం

కాచనపల్లి అమరవీరుల స్ఫూర్తి తో పోరాడుదాం….. సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ.

భూమి, భక్తి, ఈ దేశ ప్రజల విముక్తి కోసం తమ విలువైన ప్రాణాలు అర్పించిన కాంచనపల్లి అమరవీరుల స్ఫూర్తి తో పోరాడుదమని సిపిఐ( ఎం-ఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందుడివిజన్ నాయకులు పూనెం రంగన్న, అట్ఠికం శేఖర్ పిలుపునిచ్చారు.
ఆదివారం మండలంలోని కాచన పల్లి అమరవీరుల 31 వ వర్ధంతి సందర్భంగా కాచనపల్లి అమరవీరుల స్తూపం వద్ద జెండా ఎగురవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 31 సంవత్సరాల క్రితం ఈ పేద ప్రజల కోసం పోరాడుతూ పోలీసుల బూటకపు ఎన్కౌంటర్ లో కామ్రేడ్స్ కోటన్న, నోముల పరశురాములు, నంబూరి సీతారాములు,సుసేనా, సీతా లక్ష్మి అమరులుఅయ్యారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కెసిఆర్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాచనపల్లి అమరవీరులకు అర్పించి ఘన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు బొమ్మెర వీరన్న, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు ఎనగంటి రమేష్, పీ ఓ ఎల్ మండల కార్యదర్శి ఎనగంటి లాజర్,పూసం కృష్ణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యజిల్లా కార్యదర్శి చిరంజీవి, స్థానిక నాయకులు పూనేం శ్రీనివాస్, తాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular