బీరం శ్రీధర్ రెడ్డి -ది లీడర్అప్పటికి -ఇప్పటికీ- ఎప్పటికీ*
మనభారత్ న్యూస్ / బీరంనగర్
నిన్న విడుదలైన CBSE పదవ తరగతి ఫలితాల్లో బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల మరోసారి తన సత్తా చాటి కడప జిల్లాలోని అగ్రగామిగా నిలిచింది.గణితంలో 100కు 100మార్కులు తెలుగులో 100కు 100మార్కులు సాధించి 100% ఉత్తీర్ణత సాధించినటువంటి ఏకైక విద్యాసంస్థ బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాల.మొన్న MAINS ఈరోజు CBSE పరీక్ష ఏదైనా ర్యాంకుల పంట పండించడమే బీరం విద్యాసంస్థల లక్ష్యమని దానికి అనుగుణంగానే ఫలితాల ప్రభంజనం సృష్టిస్తున్నామని విద్యా సంస్థల అధినేత సుబ్బారెడ్డి గారు, చైర్ పర్సన్ సరస్వతమ్మ గారు తెలియజేశారు.ఈ వరుస విజయాలు పాఠశాల యొక్క గొప్పతనాన్ని నలువైపులా వ్యాపింప చేసేలా ఉన్నాయని వారు తెలియజేశారు అలాగే ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులను అభినందించారు.
బీరం పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప ఆఫీసర్లుగా ఎదిగి ఈ పాఠశాలకే అతిథులుగా రావాలని బీరం విద్యాసంస్థల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ గారు తెలియజేశారు.
అంకితం అనుభవం కలిగిన యాజమాన్యం,ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణమని తెలపడం జరిగింది.
హై స్కూల్ ప్రారంభ స్థాయి నుండి పదవ తరగతికి సంబంధించిన అంశాలను పిల్లలకు బోధించడం వలన వారు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉందని పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా గారు తెలియజేశారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్ చందర్ గారు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.