భారత్ న్యూస్ – మైదుకూరు
మైదుకూరు ఎర్ర చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో చెరువు నుండి అలుగు పారే నీరు వంకలో నుండి మైదుకూరు మార్కెట్ కూడా లోని వంకమీదుగా ప్రవహిస్తాయి.వంక పూర్తిగా ఆక్రమణలకు గురి కావడం కొంతమంది ముస్లిం నాయకులు డ్రైనేజీ పైనే షాపులు నిర్మించి బాడుగలకు ఇవ్వడం జరిగింది. దీనితో సాఫీగా పారాల్సిన నీరు గోడ అడ్డుపడడంతో రోడ్లపై ఇళ్లల్లోకి మోకాలి లోతు ప్రవహిస్తుండడంతో మార్కెట్ కూడలి ప్రాంతంలో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు.మున్సిపాలిటీ అధికారులు కాలువ నుండి కొట్టుకొని వచ్చిన జమ్మును తీసివేసినప్పటికీ నీరు సాఫీగా ప్రవహించడం లేదు. ఆక్రమణలు తొలగిస్తే తప్ప వంక నీరు సక్రమంగా పారదనే ప్రజలు చర్చించుకుంటున్నారు.చిన్నపాటి చెరువు అలుగు నీరుకే ఈ విధంగా ఉంటే భారీ వర్షాలు కురిస్తే మైదుకూరు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలు తొలగించి నీరు సాఫీగా ప్రవహించేల చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మార్కెట్ కూడలి లో రోడ్డుపై నీరు