ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏదీ సాధించలేడు అని బీరం పాఠశాలలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రూప్ -1ఆఫీసర్ బీరం శ్రీకాంత్ రెడ్డి గారు హాజరు అయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక వ్యక్తిని పూర్తిగా పునర్నిర్మించే శక్తి యోగా కు ఉందని ప్రతిరోజు యోగ చేయడం వలన విద్యార్థులకు మానసిక ప్రశాంతత, చదువుపట్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందుతాయని, తద్వారా విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని, అందుకుగాను ప్రతి రోజు పిల్లలు ధ్యానం, యోగ చేయాలని సూచించారు. అలాగే యోగ అనే పదంలోని ప్రతి అక్షరం యొక్క అర్థాన్ని వారు విద్యార్థులకు తెలియజేశారు.
యోగాదినోత్సవాన్ని పురస్కరించుకొని బీరం విద్యాసంస్థల చైర్మన్ బీరం సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ యోగా అనేది ఒక వ్యాయామం కాదు అది మన మనస్సును, ఆత్మను,శరీరాన్ని ఏకం చేసే ఒక మహోన్నత సాధనం యోగ చేయడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విద్యార్థులకు తెలియజేశారు.
బీరం విద్యాసంస్థల డైరెక్టర్ బీరం స్వాతి శ్రీకాంత్ గారు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగాదినోత్సవం జూన్ 21న ఎందుకు నిర్వహిస్తారో చెప్పారు. అలాగే యోగా అనేది వేద కాలం నుండి వస్తున్న మన సంస్కృతిలో ఒక ఆచారం అని తెలియజేశారు.
కార్యక్రమంలో విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో, వివిధ రకాల యోగాసనాలను మరియు యోగాసనాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పలు రంగాలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు.
యోగా దినోత్సవ వేడుకల్లో బీరం పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా గారు, కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ గారు అధ్యాపకులు పీ.ఈ.టీ లు, విద్యార్థులు పాల్గొన్నారు.