కడప జిల్లా ఇన్చార్జి మంత్రి సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘన…
మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆడా చైర్మన్కు లేని ఆహ్వానం…
తమను ఎవరు అడుగుతారులే అనుకున్నారేమో అధికారులు తెలియదు కానీ సాక్షాత్తు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సింగసాని గురు మోహన్ కు నూతన మున్సిపాలిటీ కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వానం అదికారులు తెలియపరచలేదు. అర్బన్ డెవలప్మెంట్ పరిధిలోనే మైదుకూరు పురపాలక సంఘం ఉంది. శిలాఫలకంలో పేరు మాత్రం వేశారు గాని ఆహ్వానం ఎందుకు మరిచారన్న విమర్శలు ప్రజల్లో ప్రజాప్రతినిధుల్లో వెల్లువొత్తాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినా ఆయననే అధికారులు ఎందుకు మరిచిపోయారా అన్న సందేహం వ్యక్తం అవుతుంది. సింగసాని గురు మోహన్ మైదుకూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే రేసులో నిలబెట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రావడంతోనే ఆయనను ఆహ్వానించ లేదా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి . అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో ఆరు పురపాలక సంఘాలు ఒక నగర పాలక సంస్థ మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. కడప జిల్లాలోని అన్నిపురపాలక నగరపాలక కార్యక్రమాల్లో చైర్మన్ కు ఆహ్వానమందుతూ ఆయన పాల్గొంటూ ఉన్నారు మైదుకూరులో మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు ఏర్పడిందన్న సందేహాలు వ్యక్తం స్థానికుల్లో అవుతున్నాయి. ప్రోటోకాల్ ఉల్లంఘించిన మునిసిపల్ అధికారుల పట్ల చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.