జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైందని తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మళ్లీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కాజీపేట మండలం కొత్తపేటలో సుధాకర్ యాదవ్ ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు అందించబోయే పథకాల గురించి వివరిస్తూ వైసిపి ప్రభుత్వం అరాచకాలను ప్రజలకు వివరిస్తూ గడపగడపకు తిరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ని ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి,మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి పరుక్ అహ్మద్, న్యాయవాదిబాల వెంకటయ్య,టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.