*జిల్లా స్థాయి క్రీడల్లో బీరం విద్యాసంస్థల విద్యార్థుల విజయ దుందుభి*
కడప డి ఎస్ ఏ ఆధ్వర్యంలో మున్సిపల్ మైదానం ఆవరణలో జరిగిన ఎస్ జి ఎఫ్ ఐ జిల్లా స్థాయి క్రీడల్లో బీరం శ్రీధర్ రెడ్డి విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. బ్యాట్మెంటన్ అండర్-14 విభాగంలో 9వ తరగతి చదువుతున్న ఎన్ సుదీప్ రెడ్డి అనే విద్యార్థి జిల్లా స్థాయిలో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.అలాగే చదరంగం అండర్-17 విభాగంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న *పీ కేదార్నాథ్* అనే విద్యార్థి జిల్లా స్థాయిలో నాలుగవ స్థానం మరియు ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న *పి ఓబుల్ రెడ్డి* ఆరవ స్థానాన్ని కైవసం చేసుకుని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదేవిధంగా కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సీనియర్ కోకో క్రీడలలో పదవ తరగతి విద్యార్థులు *ఎం కీర్తి రెడ్డి* మరియు *ఎం భవిత* విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బీరం విద్యాసంస్థల అధినేత శ్రీ బీరం సుబ్బారెడ్డి గారు మరియు చైర్ పర్సన్ సరస్వతమ్మ గారు విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా వారు విజేతలుగా నిలిచి మన జిల్లా పేరును రాష్ట్రస్థాయిలో మారుమోగించాలని ఆశీర్వదించారు, ఈ విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన పవన్,చెన్నయ్య, రమేష్ మరియు ఉమామహేశ్వరీలను అభినందించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ శ్రీమతి స్వాతి శ్రీకాంత్ గారు ప్రిన్సిపల్ శ్వేతా గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు మరియు తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తమ సంతోషాన్ని వ్యక్తపరచారు.