
మైదుకూరు పట్టణంలోని వేదవ్యాస పాఠశాల బస్సు ఢీకొని ఒక యువకుడు దుర్మరణం,మరొకరి పరిస్థితి విషమం…
మైదుకూరు పట్టణానికి చెందిన మదన్మోహన్ రెడ్డి మృతి, సుబ్బరాయుడు పరిస్థితి విషమం…
వేదవాస పాఠశాల బస్సుకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేకుండానే నిర్వహణ చేస్తున్న యాజమాన్యం…
విద్యా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలకు తొత్తులు గా వ్యవహారిస్తున్నారని మండిపాటు…
చూసుకోలేదు అంటున్న పాఠశాల కరస్పాండెంట్, చనిపోయిన వ్యక్తికి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా నిర్లక్ష్య సమాధానమిస్తున్నారని మృతుడి బంధువుల ఆక్రందన…
ఇన్సూరెన్స్,ఫిట్నెస్ లేదన్న సమాచారాన్ని గోప్యంగా ఉంచిన యాజమాన్యం విషయం బయటకు తెలియడంతో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన…
రవాణా శాఖ అధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది… బస్సు సీట్ల పరిమితికి మించి విద్యార్థులను రవాణా చేస్తున్న యాజమాన్యం…
స్కూల్ బస్సులకు సంబంధించి 32 నిబంధనలను పాటించాలని స్పష్టం చేస్తున్న రవాణా శాఖ అధికారులు…
ఘటన పై ఫైర్ అవుతున్న విద్యార్థి సంఘాలు, రవాణాశాఖ అధికారులు… పాఠశాలల బస్సులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తల్లిదండ్రుల డిమాండ్…
ఆర్టిఏ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి చిన్నారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని తల్లిదండ్రుల డిమాండ్…
మృత్యువాత పడ్డ యువకుడికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, ప్రజా సంఘాల విద్యార్థి సంఘాల డిమాండ్…
మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.