విద్యార్థులను అభినందించిన బీరం విద్యాసంస్థల చైర్మన్ సుబ్బారెడ్డి
మన భారత్ న్యూస్
బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు కోకో పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. చింతకొమ్మదిన్నె మండలం బయనపల్లె ఎస్. వి డైట్ ఉన్నత పాఠశాలలో యోగివేమన విశ్వవిద్యాలయ వ్యాయామ ఉపాధ్యాయులు రామసుబ్బారెడ్డి, నరేంద్రల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో బీరం విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఈ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలకు చెందిన వెంకట కృష్ణారెడ్డి (ఏడవ తరగతి) ప్రియదర్శిని (9వ తరగతి) విద్యార్థులు క్రీడల్లో చక్కటి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆ కళాశాలల చైర్మన్ బీరం సుబ్బారెడ్డి, డైరెక్టర్ స్వాతిలు, విద్యార్థులను అభినందించారు. తమ విద్యార్థులు పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం సంతోషిదాయకం అన్నారు. తమ విద్యార్థులు దేశ స్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు. ఈ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విశేష ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయురాలు ఉమాదేవి గారిని అభినందించారు.