ఎల్ఐసి యాజమాన్యం అసంబద్ధ, నిరంకుశ వైఖరి నిరసిస్తూ మైదుకూరు జీవిత బీమా కార్యాలయం ముందు ఏజెంట్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఎల్ఐసి ఏజెంట్లు నిరసన తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపుమేరకు ఎల్ఐసి యాజమాన్యం మొండివైఖరి నిరసిస్తూ భారతీయ జీవిత బీమా సంస్థ అసంబద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారత దేశ వ్యాప్తంగా ఏజెంట్లు తమ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన చెప్పటం జరిగిందన్నారు పాలసీ దారులకు పాలసీలపై బోనస్ పెంచడం తో పాటు, ఇన్సూరెన్స్ పాలసీ లపై జీఎస్టీ రద్దు, పాలసీలపై ఇస్తున్న లోన్స్ మరియు బకాయి ప్రీమియం లపై వడ్డీరేట్ల తగ్గింపు, ఎల్ఐసి పాలసీ బాండ్లను పోస్టల్ ద్వారా కాకుండా పాత పద్ధతిలోనే ఇవ్వాలని, ఐదు సంవత్సరాల పైబడిన కట్టని ల్యాప్స్ పాలసీలను పునరుద్ధరణకు పాలసీదారులకు అవకాశం కల్పించాలని, ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెంపుదల , పాలసీదారులు మెరుగైన సేవలు అందించాలనే తదితర డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు భారత దేశ వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ జాయింట్ సెక్రెటరీ చాంద్ భాషా, ప్రొద్దుటూరు బ్రాంచ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుబ్బారావు, చెన్నారెడ్డి, ప్రొద్దుటూరు బ్రాంచ్ ఈసీ నెంబర్ ఆకుల ఆంజనేయులు , వందవాసి బాబు, జయరామిరెడ్డి ,యల్లా రెడ్డి, పుల్లయ్య లతో పాటు పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు.
ఎల్ఐసి యజమాన్యం మొండివైఖరి విడనాడాలి… బ్రాంచ్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో ఏజెంట్ల నిరసన
RELATED ARTICLES