ప్రసాదాన్ని దక్కించుకున్న వైసిపి యువ నాయకుడు తప్పిట శశిధర్ రెడ్డి
మన భారత్ న్యూస్/ మైదుకూరు
అత్యంత విశిష్టత కలిగిన గ్రామ దేవత పెద్దమ్మ తల్లి యూత్ వినాయక లడ్డు ప్రసాదాన్ని మైదుకూరు పట్టణానికి చెందిన వైసీపీ యువ నాయకుడు తప్పేట శశిధర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ సంవత్సరం వినాయక లడ్డు ప్రసాదం రికార్డు ధర పలికింది.2021 సంవత్సరం 144000 పలకగా ఈ సంవత్సరం 3,05,000 రూపాయల రికార్డు ధరకు హెచ్చు పాట పాడి శశిధర్ రెడ్డి దక్కించుకున్నారు. అనంతరం పెద్దమ్మ తల్లి యూత్ నిర్వాహకులు శాలువా పూలమాలతో హెచ్చుబాటదారుడు శశిధర్ రెడ్డిని సన్మానించారు .ఈ లడ్డును పెద్దమ్మ తల్లి యూత్ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు నడుమ డీజే పాటల ఊరేగింపుగా నిర్వాహకులు హెచ్చు పాట దారుడి ఇంటికి ప్రసాదాన్ని చేరుస్తారు.పెద్దమ్మ తల్లి వినాయక ప్రసాదాన్ని దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని శశిధర్ రెడ్డి తెలిపారు.