మన భారత్ న్యూస్/ఖాజీపేట
మైదుకూరు నియోజకవర్గం ,కాజీపేట మండలం ,చెన్నముక్కపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తవ్వా బాలకొండ రెడ్డి ,వైసిపి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మిరెడ్డి తో సహా అనుచరులు 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలోకి చేరాయి . మైదుకూరు టిడిపి ఇన్చార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే పార్టీ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా నాపై నమ్మకంతో, వైసీపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు, ప్రభుత్వ ఆసమర్థత,ధరల పెరుగుదల బాదుడు కు విసుగు చెంది ఇంత భారీ సంఖ్యలో పార్టీలోకి చేరడం సంతోష దాయకమన్నారు. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ తప్పక గెలవాలన్నారు. ఒక్కసారి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే అందరికీ అండగా ఉంటూ, అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాజీపేట మండల టిడిపి అధ్యక్షుడు తిప్పిరెడ్డి లక్ష్మిరెడ్డి, జలీల్, ఫరూక్ ,పిచ్చినాయుడు, రామానాయుడు, సుబ్బయ్య యాదవ్, నరసింహులు, బాల వెంకటయ్య, నాగశివారెడ్డి, జి సుబ్బయ్య ,వెంకటసుబ్బయ్య ఇతర నాయకులు, కార్యకర్తలు, టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.