వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వికృత చేష్టలు మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి…..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి

వైసీపీ నేతల వికృత చేష్టలపై మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పై ఎవరూ ప్రశ్నించకూడదా ?

దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదు అంటూ శ్రీనివాస రెడ్డి ఒక ఒక ప్రకటనలో తెలిపారు

తాము ఎటువంటి తప్పుచేసినా ప్రశ్నించకూడదు, ప్రసారం చేయకూడదు, ప్రచురించకూడదు అనే ధోరణిలో వైసీపీ నేతలు ఉన్నారు.

మీడియా పై, ప్రతిపక్షాల పై, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా పై వైసీసీ నాయకులు అచ్చోసిన ఆంబోతుల్లా రెచ్చిపోతున్నారు.

వైసీపీ నేతల వికృత చేష్టలకు, రాష్ట్రంలోని మహిళలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. వీళ్లకా ఓట్లు వేసి గెలిపించామని అసహ్యించుకుంటున్నారు.

క్లబ్బులు పెట్టినా, కోడి పందేలు ఆడించినా, గ్యాంబ్లింగ్ చేసినా, పేకాట నిర్వహించినా, క్యాసినో నడిపినా ఎవరూ నోరు మెదపకూడదు అన్నట్లు ఉంది వైసీపీ నేతల తీరు.

ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య రాసలీలల వీడియో తో అడ్డoగా దొరికిపోయినా వైసీపీ నేతలు అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. వైసీపీ నాయకులపై ఇప్పటిదాక వచ్చిన వైసీపీ నేతల ఆడియోలు, వీడియోలపై జగన్ ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి.

ఎన్టీరామారావు గారి కుమార్తె ఉమా మహేశ్వరి మరణాన్ని కూడా నీచ రాజకీయాలకు ఉపయోగించుకోవడం వైసీపీ నేతలకే చెల్లింది.

వైసీపీ నాయకులు రోజూ ఏదో ఒక అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ట్విట్టర్ లు, ఫేస్ బుక్ లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం నిర్వహిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కేసులు పెడతామని చెప్పే గోరంట్ల మాధవ్.. ఎంపీ నామినేషన్ వేసే సమయానికే అతనిపై కేసులు ఉన్నాయన్న సంగతి గుర్తించుకోవాలి.

గోరంట్ల మాధవ్ వీడియో ను మార్ఫింగ్ చేసి విడుదల చేయాల్సిన దౌర్భాగ్యం టీడీపీకి పట్టలేదు. అనంతపురం కు గోరంట్ల మాధవ్ వస్తున్నాడంటే ఏ అఘాయిత్యానికి పాల్పడతాడో అని జనం భయపడే దుస్థితి జిల్లా లో ఏర్పడింది.

టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడి చేస్తే ఫిర్యాదు స్వీకరించి కేసు రిజిష్టర్ చేసే పరిస్థితులు రాష్ట్రం లో లేవు. ప్రభుత్వ లోపాలపై, అవినీతిపై ప్రజలు వాట్సాప్, సోషల్ మీడియా లో ఏదైనా పోస్టు పెడితే వారి ఇండ్లకు సీబీసీఐడి అధికారులు వెతుక్కుంటూ వస్తున్నారు.

వైసీపీ నాయకులు ఎన్ని దుర్మార్గాలు చేసినా వారిపై కనీసం కేసు నమోదు ఉండదు. టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలో కూడా పోలీసులు నియంత్రించే పరిస్థితి తెస్తున్నారు.

కలెక్టరేట్ కు వెళ్లి నిరసన తెలిపే స్వేచ్ఛ జిల్లాల్లో ప్రజలకు లేదు. ప్రశ్నిస్తారనే అనుమానం ఉంటే చాలు హౌస్ అరెస్టులు చేసేస్తున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ ను వదిలేసి వైసీపీకి కొమ్ము కాస్తున్నారు.

టీడీపీ నాయకులు రోడ్లపైకి రావద్దు, ప్రభుత్వ అవినీతి పై మాట్లాడొద్దు, నిరసన కార్యక్రమాలు చేయొద్దంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు, పోలీసులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.

వికృత చేష్టలకు పాల్పడుతున్న ఎంపి గోరంట్ల మాధవ్ పై పార్లమెంట్ లో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular