ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు మెజారిటీ ఆర్యవైశ్యుల సుముఖం…ఎన్నిక నామా మాత్రమే
అమ్మవారి శాల అభివృద్ధి కేరాఫ్ అడ్రస్ గా ప్రసాద్…

మైదుకూరు ఆర్యవైశ్య సభ నూతన అధ్యక్షులు బరిలో ఉన్నట్లు ప్రముఖ వ్యాపారవేత్త, సౌమ్యుడు, ఆర్యవైశ్యుల పక్షపాతి సూరిశెట్టి ప్రసాద్ గుప్తా వెల్లడించారు. ఈ సందర్భంగా అమ్మవారి శాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అనేక విషయాలను వెల్లడించారు. మైదుకూరు ఆర్యవైశ్యులు అమ్మవారి ఆశీస్సులతో తాను అధ్యక్ష పదవిని చేపడతానని, అమ్మవారి శాల అభివృద్ధికి, ఆర్యవైశ్యులకు సేవ చేయడం కోసం ఎంచుకునే బృహత్తరమైన బాధ్యత అన్నారు.
మైదుకూరు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయం చేకూరేలా చేయడం జరిగిందన్నారు. మైదుకూరు పట్టణంలోని ఆర్యవైశ్యులందరినీ కలుపుకుని ఏకతాటిపై సమిష్టి నిర్ణయంతో అభివృద్ధి చేస్తానన్నారు. ఆర్యవైశ్య మూలధనాన్ని ఏర్పాటు చేయడం, నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించడం ,ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం, పెన్షన్ సౌకర్యం, నిత్యవసర వస్తువులు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేపడతానన్నారు. స్మశాన వాటిక బృందావనంలో అసంపూర్తి పనులను పూర్తి చేస్తానన్నారు. దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఆర్యవైశ్యులందరి సహకారంతో నిర్వహించేలా చేస్తానన్నారు. అనంతరం ఆర్యవైశ్యుల ఇంటికి వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ఏలిశెట్టి ప్రసాద్ ,సునీల్ ,గోపాల్,ఆనంద్, పుల్లయ్య, ప్రసాదు, రాము, యువజన సంఘం సభ్యులు, ఆర్య వైశ్యులు పాల్గొన్నారు.