మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు హై పవర్ కమిటీ పేరుతో తాత్సరం చేయకుండా ముఖ్యమంత్రి గారు తక్షణం పరిష్కరించాలి. –ఏ.ఐ.టీ.యు.సి., సిఐటియు ,….. మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు 3వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో బాగంగా బుధవారం మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ-సీఐటీయు అద్వర్యంలో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.శ్రీరాములు, నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు పి.భాస్కర్, ఏ.వి.శివరామ్, సిఐటియు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయకుమార్, సిఐటియు మండల కార్యదర్శి సుబ్బరాయుడు లు మాట్లాడుతూ 11వ పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయడం లేదని, ముఖ్యమంత్రి వాగ్దానం మేరకు అమలు చేస్తున్న హెల్త్ అలవెన్సు 6 నెలలు తరబడి దాన్ని అమలు చేయకుండా బకాయి పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీఓల ప్రకారం స్కిల్డ్ ,సెమీ స్కిల్డ్ కార్మికులకు అమలు చేయాల్సిన వేతనాలు అమలు కానందున కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి అన్నారు.మూడు సంవత్సరాల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని మాట ఇస్తున్నా మాట తప్పును అని వాగ్దానం చెసి నేడు ఆందోళనలు చేస్తుంటే మళ్ళీఅధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని మాట తప్పి మడమ తిప్పిరాని ఆరోపించారు.కార్మికుల రక్షణ పరికరాలు వంటి కనీస సమస్యలను కూడా పరిష్కరించడం లేదని గత 3 ఏళ్లల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. కరోనా సమయంలో 170 మంది విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారని ఏ ఒక్కరి కూడా కరోనా వారియర్స్ కింద ప్రమాద బీమా 50 లక్షల రూపాయలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పట్టణాలు పెరుగుతున్నాయి. పనిభారం పెరుగుతోంది. కానీ, కార్మికుల సంఖ్యను పెంచడం లేదు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించలేని డిమాండ్స్ మాత్రం కాదని వారికి హెల్త్ అలవెన్స్ మంజూరు చేసి, సమాన పనికి – సమాన వేతనం, నాలుగు పూటల మస్టర్ విధానాన్ని ఎత్తివేయాలని, ఆదివారం సెలవు మంజూరు చేయాలని, పనిభారం తగ్గించాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి ఆప్కాస్ విధానం నుండి కార్మికులను మినహాయించాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్యం పని స్తంభించే పరిస్థితి ఉంది.వార్షాకాలం కావున వీధుల్లో చెత్త, చెదారం పేరుకుపోయిన ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యపాలయ్యే ప్రమాదం ఉందని. కావున మంత్రులు, అధికారులు వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను జేఏసీ తో చర్చించి పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక నాయకులు బి.పీరయ్య, ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు గొల్లపల్లి వెంకటసుబ్బయ్య, గవ్వల వెంకటసుబ్బయ్య, ఆదినారాయణ, మహేంద్ర, దాసరి సతీష్, బాలు, హరి, చింతల్ రెడ్డి, సుదర్శన్,కళ్యాణ్, చెండ్రాయుడు, రవీంద్ర, ఓబన్న, నాగేంద్ర, సిఐటియు నాయకులు ఓబులేసు, పుల్లమ్మ, గంగులయ్య, చిన్న, సుబ్బమ్మ, కైపు రాముడు, నాగన్న, ఓబులమ్మ, శేఖర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES