భారత్ న్యూస్/మైదుకూరు
అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు అని బీజేపీ నేత మాచునురు సుబ్బరాయుడూ అన్నారు. నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, భాగవతం..మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాస మహాముని జన్మదినమే గురు పూర్ణిమ అన్నారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బ్రహ్మంగారిమఠం నందు అచలానంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గిరిజానంద స్వామి గురువుగారి పాదపద్మములకు పుష్పాలతో, శాలువా పూలమాలలతో సత్కరించి నమస్కరించి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రఘునాథరెడ్డి ,భార్గవ్ యాదవ్, హరిరాయలు పాల్గొన్నారు.