2021 -2022 సంవత్సరాలకు సంబంధించి కర్నూలు SEB స్టేషన్ పరిధిలోని 593 కేసులలో పట్టుబడిన 66 వేల మద్యం ( సుమారు 2 కోట్ల విలువ ) బాటిళ్ళను శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ గారి సమక్షంలో కర్నూలు మండలం, పంచలింగాల గ్రామం నుండి ఈ. తాండ్రపాడు గ్రామం కు వెళ్ళు దారిలో రైల్వే బ్రిడ్జి వద్ద గల రోడ్ నందు మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు.
నాటుసారా, మద్యం అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై గట్టి నిఘా ఉంచి కట్టడి చేయాలని సెబ్ పోలీసులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ( సెబ్ అడిషనల్ ఎస్పీ ) ప్రసాద్, ఎఈఎస్ ఇంచార్జ్ రాజశేఖర్, కర్నూలు సబ్ స్టేషన్ సిఐ సత్యనారాయణ పాల్గొన్నారు.