భారత్ న్యూస్/మైదుకూరు
.
రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు విలీనం లో భాగంగా బాల నగర్, చెన్నముక్కపల్లి ఎస్ సీ కాలనీ పాఠశాల లను కొత్తపేట పాఠశాల లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీనితో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా కొత్తపేట పాఠశాల కు రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పాఠశాల ల విలీనం ప్రభుత్వ వైఫల్యం అని అన్నారు. తహసిల్దార్ రమణారెడ్డి పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు