.
భారత్ న్యూస్….
చాపాడు మండలం తప్పెట ఓబయ్య గారి పల్లె గ్రామ పంచాయతీ రేపల్లె గ్రామానికి చెందిన జట్కా బయమ్మ ఇంటి వద్ద, 40 సంవత్సరాల నుండి ఉండే విద్యుత్ స్తంభం వలన ప్రజలకు ఎటువంటి అవరోధం లేకున్నా బయమ్మా తెలుగు దేశం పార్టీ సానుకూల పరురాలు అని అధికార పార్టీ నాయకులు,ఉద్దేశ పూర్వకంగా విద్యుత్ ఆధికారుల పై ఒత్తిడి తెచ్చి ఆ స్తంభాన్ని జట్కా జయమ్మ సొంత స్థలం లో పెట్టాలని ఆధికార పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తుంటే ఈమె విద్యుత్ ఆధికారులు , పోలీస్ ల దృష్టి కి ఈ సమస్య ను తీసుకొని పోయినను వారు ఆధికార పార్టీ నాయకుల మాటలను విని ఆధికారులు స్పందించ లేదు, బలవంతం గా స్తంభాన్ని జట్కా బయామ్మ స్థలం లో పాతి పెట్టాలని ప్రయత్నిస్తుంటే బయమ్మ అడ్డుపడింది అని, వైసీపీ నాయకులు అర్థ రాత్రి సమయంలో ఆమె ఇంటి మీద పడి జట్కా బయమ్మ కోడలిని, ఆమెను అడ్డు వచ్చిన కొడుకును విపరీతంగా కొట్టడం జరిగింది.బయమ్మ మనస్థాపం చెంది ఆత్మ హత్య ప్రయత్నం చేసుకొంది, బయమ్మా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రాణ పాయ స్థితి లో ఉన్నది. పోలీసు వారు నిష్పాక్ష పాతంగా విచారించి నిదితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని, టీడీపీ కడప జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి పి ముని శేఖర్ రెడ్డి, చాపాడు మండలం టీడీపీ నాయకులు రవి శంకర్ రెడ్డి, చాపాడు మండలం క్లస్టర్ ఇంఛార్జి నాగులపల్లే ప్రభాకర్ రెడ్డి, తదితరులు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.