భారత్ న్యూస్/మైదుకూరు
కడప జిల్లా మైదుకూరు లో పెరిగిన ఆర్టీసీ ఛార్జిలకు నిరసనగా పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ ర్యాలీ, నిరసన చేపట్టారు. డిపో మేనేజర్ పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని వినతిపత్రం సమర్పించారు.అనంతరం
మైదుకూరు నుంచి ఖాజీపేట వరకు ఆర్టీసీ బస్ లో ప్రయాణించి పెంచిన చార్జీల గురించి సుధాకర్ యాదవ్అడిగి తెలుసుకున్నారు.బాదుడే బాదుడు లో భాగమే సామాన్యులకు ఆర్టీసీ చార్జీలు పెంపు అన్నారు.
పేద, మధ్యతరగతి ప్రజలపై వైసీపీ ప్రభుత్వం భారం మోపుతూనే ఉంది అన్నారు.
గత రెండు నెలలలోనే మూడోసారి ఆర్టీసీ చార్జీలు పెంచారు అన్నారు.
ప్రజలపై 2500 కోట్ల రూపాయల భారం మోపింది వైసీపీ ప్రభుత్వం అన్నారు.
కుందు నదిలో వైసిపి నాయకులు విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారన్నారు.
ఒక లారీ ఇసుక 18 వేల రూపాయలకు అమ్ముకొని అవినీతికి పాల్పడుతున్నారు అన్నారు.రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అమ్ముకుంటున్నారన్నారు.
ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశాం స్పందించకపోతే కోర్టుకు వెళ్లి ఫీల్ వేస్తా అని హెచ్చరించారు.
అవినీతి సొమ్మంతా సీఎం జగన్మోహన్ రెడ్డికి చేరుతోంది అన్నారు.ప్రజలు ఇప్పటికైనా మేల్కొని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు, టిడిపి నేత మిల్లు శీను, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, చాపాడు మండల టిడిపి అధ్యక్షులు అన్నవరం సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్ రాధాకృష్ణ, సుబ్బారెడ్డి ధనపాల రవి, రాకెట్ రఫీ,ప్రసాద్, పాశం మారుతి, రమేష్ నాయుడు,మహేంద్ర ,తదితరులు పాల్గొన్నారు.