కడప జిల్లా
ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని మహాత్మా నగర్లో నివాసం ఉంటున్న ఏ ప్రభంజన రెడ్డి కి 20 21 ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ లో మూడవ ర్యాంకు లభించింది.ఇతనికి అల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ ప్రవేశ పరీక్షల్లో రెండో అటెంప్ట్ లో ఈ ర్యాంకు లభించింది. ఇతని తల్లిదండ్రులు ఏ రామాంజనేయులు రెడ్డి, ఏ సూర్యకుమారి. తన స్వగ్రామము పులివెందుల నియోజకవర్గంమండల కేంద్రమైన తొండూరు. ప్రస్తుతము ఎర్రగుంట్లలో తన తల్లిదండ్రులు శ్రీ బాలాజీ విద్యా విహార్ అప్పర్ ప్రైమరీపాఠశాల నడుపుతున్నారు. అతని సోదరుడు యశ్వంత్ రెడ్డి అమెరికాలో ఎంఎస్ చేస్తున్నారు. తనకు ఆల్ ఇండియా ఫారెస్ట్ సర్వీస్ లో మూడవ ర్యాంకురావ డము సంతోషంగా ఉందని తెలిపారు.