దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు చరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండవ వర్ధంతి సంద్భంగా మంత్రి ఘన నివాలులర్పించారు. ఈ సందర్భమంత్రి కాసరబాద్ రోడ్డు లో ని స్మృతి వనం లొ కుటుంభ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని కుటుంభ సభ్యులు, ప్రజప్రతినిదులతో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాల తో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని చేర వేసినట్లైందని ఆయన తెలిపారు. ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేపటి రోజున వారి వారి కుటుంబాలకు భారతప్రజలు అండగా ఉంటారు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయానికి సందేశం అని ఆయన చెప్పారు. భారత్ -చైనా సరిహద్దుల్లో కల్నల్ సంతోష్ బాబు చనిపోతే ఆయన భౌతిక ఖాయన్ని తెలంగాణా ప్రభుత్వం హకింపేట వద్ద నుండి సూర్యాపేట వరకు తీసుకు వస్తున్నప్పుడు దారిపోడువునా ప్రజలు నీరాజనం పలికిన తీరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశానికి అద్దం పడుతుందన్నారు.అటువంటి త్యాగానికి ఏమియిచ్చినా సరిపోదని దేశభద్రత కోసం ప్రాణాలు అర్పించిన వారి వెంట తెలంగాణా ప్రభుత్వం,ప్రజలు ఉంటారు అని తెలియ జెప్పేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పునట్లుగా పుట్టిన వారు మరణించక తప్పదని, జీవించినంత కాలం ఎలా బతికి ఉన్నామన్నది ముఖ్యమని ఆయన అన్నారు. ఆ కోవలోనే కల్నల్ సంతోష్ బాబు జాతి ఉన్నంత కాలం ప్రజల మనసులో చిరస్మరణీయుడిగా నిలిచి పోతారన్నారు. అటువంటి మహనీయుడు ప్రాణ త్యాగం చేసింది మొదలు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి ప్రశంసిం చారు. కార్యక్రమం లొ కల్నల్ సంతోష్ కుటుంభ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మార్కెట్ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్, జడ్పీటిసి జీడి బిక్షం, రాష్ట్ర టీ.అర్. ఎస్ కార్యదర్శి వై.వీ, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ, పట్టణ ప్రమఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు..
స్మృతి వనంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి*
RELATED ARTICLES