కడపలో బీరం విద్యార్థుల విజయ ర్యాలీ …
జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాలకు చిహ్నంగా బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల యాజమాన్యం సమక్షంలో విద్యార్థుల విజయ యాత్రను కడప నగరంలో అట్టహాసంగా నిర్వహించారు.బీరం విద్యా కుసుమాలైన వి. సాత్విక( 99.62), పి.లక్ష్మీ గణేష్( 99.51),జి. నాగదస్తేశ్వర కుమార్ (99.32), పి కేదార్నాథ్ (99.13), శ్రీ విష్ణువర్ధన్ (98.40), పి.లక్ష్మీ బావన (98.00), పి.ప్రియ దీపిక( 97.01), ఎన్. అఖిల్ కుమార్ (97.01 ),సి.హరి ధనుష్ (95.61), కె.సుమంత్ రెడ్డి (95.34), బి.సాయి తేజ రెడ్డి( 95.12 )పర్సంటైల్,మరియు 90 పర్సంటైల్ కి పైగా 17 మంది విద్యార్థులు సాధించారు.
వారి ఘన విజయానికి ప్రతికగా వారితోపాటు 600 మంది విద్యార్థులు,అధ్యాపకులు ఒక ప్రభంజనంలా ర్యాలీని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముఖ్య అతిథులుగా R.D.Oమధుసూదన్ గారు , D.S.P షరీఫ్ గారు , District Employment Officer సురేష్ కుమార్ గారు, VC KUDA ఓబులేసు నందన్ గారు విచ్చేశారు.మొదటగా కడప నగరంలోని బీరం శ్రీధర్ రెడ్డి జూనియర్ కళాశాల ప్రాంగణంలో అతిథులతో జ్యోతి ప్రజ్వలన గావించి ర్యాలీని ప్రారంభించడం జరిగింది.ర్యాలీని ఉద్దేశించి ముఖ్య అతిథులు R.D.Oమధుసూదన్ గారు, D.S.P షరీఫ్ గారు మాట్లాడుతూ స్థాపించిన అనతి కాలంలోనే ప్రారంభించిన మొదటి బ్యాచ్ తోనే 20 మంది విద్యార్థులు ఐఐటీ,యన్ఐటి సీట్లు సాధించడమే కాకుండా, రెండవ బ్యాచ్ తో కూడా ఆ ర్యాంకులకు దీటుగా 25 మందికి 90 కి పైగా పర్సంటైలు రావడం మన జిల్లా పేరును ఆల్ ఇండియా స్థాయిలో వినపడేలా చేసినందుకు గర్వకారణంగా ఉందని భవిష్యత్తులో ఐఐటి, నీట్ ర్యాంకులకు బీరం ఒక బ్రాండ్ గా మారుతుందని ఐఐటి, నీట్ కలలు నెరవేర్చుకునేందుకు బీరం కళాశాల ఒక నిలయంగా మారిందని తెలియజేశారు.మరియు District Employment Officer సురేష్ కుమార్ గారు,VC KUDA ఓబులేసు నందన్ గారు మాట్లాడుతూ బీరం విద్యా ప్రమాణాలు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ విద్యా సంవత్సరం నుండి కడప నగరంలో జిల్లా పరిషత్ భవన సముదాయంలో నూతన జూనియర్ కళాశాల బ్రాంచ్ ప్రారంభించారని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని తమ ఐఐటి, నీట్ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.
మరియు అనుభవం, అంకితభావం కలిగిన యాజమాన్యం,అధ్యాపక బృందం,ఆకర్షణీయమైన భవన సముదాయం బీరం విద్యాసంస్థల యొక్క ప్రత్యేకత అని వారు తెలియజేశారు.
కార్యక్రమంలో జేఈఈ మెయిన్స్ లో పర్సంటైల్ సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి వారి విజయానికి స్ఫూర్తిగా ఊరేగిస్తూ కడప నగరం యందు ర్యాలీని అట్టహాసంగా నినాదాలతో, పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో, జనరంజకంగా కొనసాగించారు.
ఈ జైత్రయాత్రలో బీరం కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, చైర్ పర్సన్ సరస్వతమ్మ,డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్,స్కూల్ ప్రిన్సిపల్ శ్వేత, కళాశాల ప్రిన్సిపల్ హేమ చందర్, విద్యార్థులు, అధ్యాపకులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.