• బడిని దూరం చేసి చదువును భారం‌ చేయొద్దు.
  • 3,4,5 తరగతులు విలీనాన్ని వెంటనే ఆపాలి.
    • ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్

భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మైదుకూరు మండలంలో మండల విద్యాశాఖ కార్యాలయం 3,4,5 తరగతులు విలీనాన్ని ఆపాలని, 117 జీఓ ని రద్దు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గండి సునీల్ కుమార్ మాట్లాడుతూ…
పాఠశాలల విలీనాన్ని ఆపాలని, 117 రద్దు చేయాలని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఉపాద్యాయులు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దారుణమని వారు అన్నారు. పాఠశాలలు విలీనం వలన ఉపాద్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1:40 నుండి 1:60 కి పెరుగుతుందని వారు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్టులకు ఉపాద్యాయులు లేరన్నారు. ఈ పరిస్తితులలో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విలీన ప్రక్రియ ఏ రకంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇవ్వగలరో వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియ వలన వేలాది మంది విద్యార్థులు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందన్నారు. డ్రపౌట్ లు పెరిగే ప్రమాదం వున్నదని అమ్మాయిలు చదువు మనుకునే పరిస్తితి వస్తుందన్నారు. భవిష్యత్ లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ వుండవన్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు డీ.ఎస్.సి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వారందరికీ అన్యాయం చేసినట్టు అవుతుందని. కార్పొరేట్ల కు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని. వారు అన్నారు. మైదుకూరు మండలంలో దాదాపు ఏడు ప్రాథమిక పాఠశాలు విలీనం అవుతున్నాయని, వాటిలో జివి సత్రం వద్ద ఉన్న శ్రీరామ నగర్ లో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వంక, జాతీయ రహదారులను రోజు దాటవలసి వస్తుందని, రేషన్ ను ఇంటి వద్దకే ఇచ్చే ప్రభుత్వం 3,4,5 తరగతుల చిన్న పిల్లలను ఊరి మధ్యలో ఉన్న పాటశాల నుండి ఊరి పెలుపలకు పోవడం ద్వారా నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారి చిన్నపాటి వర్షానికే ప్రవహించే వక్క వలన విద్యార్థులు అనునిత్యం ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారని వారు అన్నారు, రోజు వారి కూలీ కి వెళ్లే పేద కుటుంబాలు నివసించే ప్రాంతాలలో ఈ పాఠశాలలు ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మారకపోతే విద్యార్థులతో మండల విద్యా శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఎంఈఓ పద్మలత గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎద్దు.రాహుల్, ఎర్రవల్లి అజయ్, వహీద్ లు పాల్గొన్నారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular