భారత్ న్యూస్/ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరు 350 పడకల ఆ ప్రభుత్వ పెద్ద ఆస్పత్రిలో పారిశుద్ధ్యం పడకేసింది. చెత్తాచెదారం పేరుకుపోవడం, వైద్య వ్యర్థాలను అక్కడే పడేయడం. సకాలంలో తరలించక పోవడం పరిపాటిగా మారింది. దీంతో ఆసుపత్రి పరిసరాలు దుర్గంద భరితంగా మారాయి. అటువైపు వెళ్లాలంటేనే ముక్కు పూటలు అదురుతున్నాయి. వీటికి తోడు ఎలుకలు పందికొక్కులు ఊర పందులు స్వైర విహారం చేయడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. వృధా నీరు కూడా పైపుల నుంచి సక్రమంగా వెళ్లడం లేదు. ఆసుపత్రిలో నల్లులు, దోమలు, ఈగలు,తో రోగులు సహాయకులు పడుతున్న ఇబ్బందులు సరే సరి. కొన్ని రోజుల క్రితం ఇదే హాస్పిటల్లోకి పది అడుగుల పెద్ద పాము వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పారిశుధ్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని పేషెంట్లు వాపోతున్నారు.