భారత్ న్యూస్
భారత్ న్యూస్ /మైదుకూరు
మైదుకూరు టిడిపి ఇన్చార్జ్ మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం తధ్యమని కడప జిల్లా టిడిపి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రెడ్డి ఆశాభవం వ్యక్తం చేశారు. ముని శేఖర్ రెడ్డి ప్రొద్దుటూరు లోని సుధాకర్ యాదవ్ నివాసంలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా సత్కరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మైదుకూరు ఎమ్మెల్యే టికెట్ సుధాకర్ యాదవ్ గారికి ఖరారు చేయడంతో ఆయనకు అభినందనలు తెలియజేశారు.