మన భారత్ న్యూస్
జనసేన పార్టీ కౌలు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఈనెల 20వ తేదీన కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాజంపేట నియోజకవర్గ పరిధిలోని సిద్ధవటం లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ లో ప్రసంగించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధతో కృంగిపోయి బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి కుటుంబం కు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు పాల్గొననున్నారు.