
సీఎం జగన్ పాదయాత్రలో వేలాది మంది మహిళలు తో దిగ్విజయం చేసి లక్ష రూపాయలు చందా ఇచ్చిన నా భూమిని కబ్జా చేశారని వైసీపీ నాయకుడీ ఆవేదన వ్యక్తం చేసారు.మైదుకూరు నియోజకవర్గంలో పెడకంటి సామాజిక వర్గాన్ని అనగదొక్కెందుకే ఎమ్మెల్యే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపణ చేసారు.మైదుకూరు మండలం నంద్యాలంపేట గ్రామ పొలంలో సర్వేనెంబర్ 839 విస్తీర్ణం రెండు ఎకరాల 9 సెంట్లు 2010 లో కొనుగోలు చేశానన్నారు మైదుకూరు నియోజకవర్గం లో పెడకంటి రెడ్ల ఓట్లు దాదాపు 40000 గా ఉన్నాయి మమ్మల్ని అనగదొచ్చే ప్రయత్నంలో భాగంగానే నా భూమిని కబ్జా చేయాలని రెండు సంవత్సరాలుగా వైసీపీ నాయకుడు అనుచరులు చూస్తున్నారన్నారు.మైదుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలలో పెడకంటి రెడ్లను అణచివేతకు గురిచేసిన ఉదాంతంపై కిషోర్ రెడ్డీ వివరించారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదృష్టికి తీసుకెళ్తానన్నారూ .స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే భూమిని కబ్జా చేస్తున్నామని కబ్జాదారులు చెబుతున్నారని భూమిలోకి వస్తే మీ అంతు చూస్తామని బెదిరిస్తున్నారని అన్నారు.నా భూమిని కబ్జా చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది అన్నారు .మైదుకూరు మండల తాసిల్దార్ దృష్టికి సైతం తీసుకెళ్లాను పరిశీలించి తగి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందన్నారు.అధికారుల స్పందించి కబ్జాదారులను భూమిని కాపాడి న్యాయం చేయాలని వైసీపీ నేత బాధితుడు కిషోర్ రెడ్డి కోరారు.