23 మంది విద్యార్థులకు 90% పైన మార్కులు,100శాతం ఉత్తీర్ణత..
భారత్ న్యూస్/మైదుకూరు
సీబీఎస్ఈ 2022 సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు విజయ డంకా మోగించారు. 23 మంది విద్యార్థులు 90% పైన మార్కులు సాధించడమే కాక ప్రతి ఇద్దరిలో ఒకరికి 80% పైగా మార్కులు రావడం విశేషం. పదవ తరగతిలో 144 మంది విద్యార్థులు ఉండగా 100% ఉత్తీర్ణత సాధించారు. సాత్విక 500కు 492 మార్కులు సాధించి ఆల్ ఇండియాలో 8వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా విష్ణువర్ధన్ 500 కు 488 మార్కులు సాధించారు. దే దివ్య 500 కు 486 మార్కులు సాధించింది ఇంతటి ఘన విజయాన్ని సాధించడం పట్ల బీరం విద్యా సంస్థల చైర్మన్ బీరం సుబ్బారెడ్డి గారు విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఆ సంస్థల డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ శ్వేత రాయలసీమ జిల్లాల్లో అత్యధిక మార్పులు సాధించడం సంతోషదాయకమన్నారు.