భారత్ న్యూస్
కడపజిల్లా మైదుకూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం వికటించి గర్భిణీ మహిళ మృతి చెందడంతో… మృతురాలి బందువులు ఆందోళన చేపట్టారు.
శ్రీనగరం గ్రామానికి చెందిన ఖాదర్ భాషా నిండు గర్భిణి అయిన తన భార్య జిలేఖ కు పురిటి నొప్పులు రావడంతో…
ఆదివారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో మైదుకూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
డ్యూటీ డాక్టర్ గా ఉన్న డాక్టర్ నరసింహ… నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన భార్య జిలేక మృతి చెందిందని… మృతురాలి భర్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.