భారత్ న్యూస్/మైదుకూరు
దువ్వూరు మండలం కానగూడూరు గ్రామానికి చెందిన ముస్లిమ్ మైనారిటీ నాయకులు వన్నూరు సాహెబ్,కోట్ల బాషా,అన్వర్, దస్తగిరి,తదితర నాయకులు వారి అనుచరులు దాదాపు 100 కుటుంబాలు టీడీపీ ఇంఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పార్లమెంట్ అధ్యక్షుడు లింగారెడ్డి,ముక్తియర్ ల ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా లింగారెడ్డి, ముక్తియార్ లు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పై ప్రజలు విసిగి పోయారని , అభివృద్ధి లేదు ,ఉద్యోగ ,ఉపాధి లేదు ,ప్రజలపై బాదుడే బాదుడు పన్నులభారం ఈ ప్రభుత్వం చేస్తుందని ప్రజలే త్వరలో బుద్ది చెపుతారని ప్రభుత్వం పై విరుచుకుపద్దారు..అనంతరం సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ టిడిపి పార్టీ పై ఉన్న నమ్మకం పై పార్టీలో చేరిన వారందరికీ నేను ఎప్పుడూ అండగా ఉంటానన్నారు..ఇప్పుడు ఎన్నికలు లేవు ఇంకా రెండు సంవత్సరాలు సమయం ఉంది అయితే వైకాపా ప్రభుత్వం పై విసుగుచెంది టిడిపి లో చేరారు.ఈ రోజు పార్టీ లో చేరిన వారందరూ వచ్చే ఎన్నికలలో కష్ట పడి పని చేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గా నన్ను గెలిపిస్తే వచ్చేది మన టిడిపి ప్రభుత్వం కాబట్టి నేను కూడా ఈ రోజు ఎవరైతే పార్టీ కోసం, నాకోసం కష్ట పడతారో వారికి పార్టీ తో పాటు నేను కూడా అన్నివిధాలుగా, అన్నిరకాలుగా మీకు సహాయ సహకారాలు తో పాటు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా టిడిపి మహిళా అధ్యక్షురాలు K. శ్వేతారెడ్డి,కడప జిల్లా టిడిపి మహిళా జనరల్ సెక్రెటరీ శ్రీదేవి గారు తో పాటు మండల టిడిపి అధ్యక్షులు బి.వెంకట రమణారెడ్డి తో పాటు రాష్ట్ర,జిల్లా ,మండల టిడిపి నాయకులు,భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.