భారత్ న్యూస్
మైదుకూరు పసుపు కొనుగోలు కేంద్రంలో రైతుల వద్ద నుండి సాకులు చెబుతూ పసుపు కొనుగోలు చేయకపోవడంతో విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి కొనుగోలు కేంద్రం కు చేరుకుని ,రైతులు పడుతున్న అవస్థలను గురించి తెలుసుకున్నారు. అడ్డగోలు నిబంధనలను చెప్పి పసుపు కొనుగోలు చేయని అధికారులపై మండిపడ్డారు. మైదుకూరు ప్రాంతం గ్రేడ్ వన్ పసుపును పండిస్తుందని ,ప్రస్తుత సంవత్సరం పసుపు పైరు దెబ్బతినడంతో ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని, రైతులతో ప్రభుత్వం గల్లా పెట్టే వ్యాపారం చేస్తుంద ఆని మండిపడ్డారు. అనంతరం ఉన్నతాధికారుల దృష్టికి రైతుల సమస్యలను తెలియజేశారు. పూర్తిస్థాయిలో రైతుల నుండి పసుపు కొనుగోలు చేయని పక్షంలో టిడిపి పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేత చంద్రశేఖర్ రెడ్డి, టిడిపి నాయకులు రామిశెట్టి శ్రీనివాసులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.