రాజన్న రాజ్యం లో హిజ్రాపై గ్యాంగ్ రేప్…ఎనిమిది మంది అరెస్ట్

భారత్ న్యూస్

రాజన్నరాజ్యం పులివెందుల లో బిచ్చం ఎత్తుకుంటున్న హిజ్రాపై గ్యాంగ్ రేప్ చేశారని పులివెందుల స్టేషన్ లో పిర్యాదు చేసింది.

దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు హిజ్రా అత్యాచారం కేసులో 8 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డి.ఎస్.పి శ్రీనివాసులు తెలిపారు. గురువారం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నిన్న సాయంత్రం 5:30 ఐదున్నర గంటల ప్రాంతంలో కదిరి రింగ్ రోడ్డు సమీపంలో హిజ్రా బిక్షాటన చేసుకుంటూ ఉంది. పులివెందుల ప్రాంతానికి చెందిన 13 మంది వ్యక్తులు సత్యసాయి జిల్లా నల్లచెరువు పల్లెకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో భిక్షాటన చేస్తున్న హిజ్రా పై అత్యాచారయత్నం చేశారు. ఈ సంఘటనపై హిజ్రా బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చి తనపై లైంగిక అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని గురువారం సాయంత్రం గంగమ్మ గుడి వద్ద ఒక ఎన్నో కారును, ఎనిమిది మంది నిందితులు పట్టుకున్నామని. వీరంతా పులివెందుల ప్రాంత వాసులు అని వీరి పేర్లు పాలెం చక్రి ధర్ రెడ్డి, కావేటి చలపతి, అన్నారెడ్డి బాల గంగిరెడ్డి, గురు ప్రసాద్ , సోమన బోయిన బ్రహ్మయ్య, జయచంద్రారెడ్డి, మల్లు హరికృష్ణ, కాకి ధన్య కుమార్ లను అరెస్టు చేయడం జరిగిందని మిగిలిన ఐదు మంది అరుణ్ కుమార్ అలియాస్ చిన్న, షాకీర్, సుభాష్, బాబావలి, పి ఈ టి సురేంద్ర లు పరారీలో ఉన్నారని వీరిని కూడా ఒకటి రెండు మూడు రోజుల్లో అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులివెందుల రూరల్ సీఐ మద్దిలేటి, పట్టణ ఎస్ఐ లు గోపీనాథ్ రెడ్డి , చిరంజీవి, ఏ ఎస్ ఐ స్వామి, తదితరులు ఉన్నారు.

latest

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular