ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే రఘురామి రెడ్డి..
మన భారత్ న్యూస్
.మైదుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా శ్రీమన్నారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీమన్నారాయణరెడ్డి తో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారంచేశారు. వ్యవసాయ మార్కెట్‌కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంను మార్కెట్ కమిటీ సమీపంలోని కశెట్టి కళ్యాిణ మంటపంలో ఏర్పాటు చేయగా మైదుకూరూ ఎమ్మెల్యే రఘురాంరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున బాలాసంచా పే లుస్తూ స్వాగతం పలికారు. మండలంలోని రైతాంగంతోపాటు,రైతు ప్రతినిధులు, వైసీపీ నాయకులు,శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రడైరెక్టర్ దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి, డీసీసీ మాజీ ఛైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాలురెడ్డి, మైదుకూరు పురపాలిక ఛైర్మన్ మాచనూరు చంద్ర, ప్రజాప్రతినిధులు రామగోవిందురెడ్డి, వీరనారాయణరెడ్డి, జయచంద్రారెడ్డి, లక్షుమయ్య, అచ్చుకట్ల కరీముల్లా, సిద్దిక్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నియోజకవర్గంలోని అయిదు మండలాలకుచెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైసీపీ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీమన్నారాయణరెడ్డికి శాలువ పూలమాలతో సత్కరించి అభినందలు అందజేశారు