మేలు చేసిన వారిని ఆదరించండి
ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి
మున్సిపాలిటీలోని మూడో వార్డులో టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లోకి 100 కుటుంబాల చేరిక.
మైదుకూరు మున్సిపాలిటీ లోని మూడవ వార్డు పరిధిలో ఎల్లంపల్లె, పుల్లయ్య స్వామి సత్రంలో ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి సమక్షంలో టిడిపి నుంచి 100 కుటుంబాల వారు వైఎస్ఆర్సిపి లో చేరారు._
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామి రెడ్డి మాట్లాడుతూ, 2014లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి చేయలేదని ఆరోపించారు. పేదలకు ఇళ్ల స్థలాలు గానీ, పక్క ఇల్లు గాని ఇవ్వలేదని, రోడ్లు వేయలేదని, ఆస్పత్రులు కట్టించలేదని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే డ్వాక్రా మహిళలకు బ్యాంకుల్లో ఉన్న బకాయిలు 26,500 కోట్ల రూపాయలను చెల్లించారని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విద్యాదీవెన, వసతి దీవెన అందించారని పేర్కొన్నారు. అమ్మ ఒడి.. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద.. వంటి కార్యక్రమాలతో హైస్కూలు వరకు ఉన్న విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగేలా చేశారని పేర్కొన్నారు. కేవలం ఎల్లంపల్లి సచివాలయం పరిధిలోనే వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాల ద్వారా 1.5 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. తిరుమల నాథ స్వామి గుడి వరకు 1. 5 కోట్లతో బీటీ రోడ్డు, మైదుకూరులోని అంకాలమ్మ గుడి వద్ద నుంచి నానుబాల పల్లె వరకు రెండు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు వేశామని తెలిపారు. ఎల్లంపల్లి సమీపంలోనే చిన్నయ్య గారి పల్లెలో అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేసి ,అందులో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు 120 రకాల వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చేలా చేశామని వివరించారు.ఎవరు మేలు చేశారు, ఎవరు చేయలేదు అనేది గమనించి మేలు చేసిన వారికే ఓటు వేయాలని కోరారు.
100 కుటుంబాల వారు చేరిక… ఎల్లంపల్లిలో మూడవ వార్డు ఇన్చార్జి మూలే రమణారెడ్డి గోవిందు శేషారెడ్డి పాలూరు ప్రసాద్ రెడ్డి కొట్లూరు అసేన్ గోవిందు కృష్ణారెడ్డి కోట్లూరు హుస్సేన్ పీరా బుడ్డే బాయ్ గారి హుస్సేన్ ఖాజావల్లి కోట్లూరు మాబుసాహెబ్ తదితర 70 కుటుంబాల వారు
పుల్లయ్య స్వామి సత్రంలో… మూలే వెంకట సుదర్శన్ రెడ్డి ఈయన ఆధ్వర్యంలో గుజ్జుల రామసుబ్బారెడ్డి గండికోట రాజగోపాల్, సాకం బాలసుబ్బారెడ్డి (బుజ్జి), రాజాల చిన్నారెడ్డి, గుజ్జుల శేషారెడ్డి, మూలె పుల్లారెడ్డి, చెన్నారెడ్డి ,భాస్కర్ రెడ్డి, నిగిలి పిచ్చయ్య నాయుడు, తిరుపాల్, గండికోట రవి లక్ష్మీదేవి రాజేశ్వరి రామసుబ్బారెడ్డి మూలే నాగులమ్మ తదితర 30 కుటుంబాల వారు.
వీరికి ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్మయి పార్టీ కండువాలు వేసి వైఎస్ఆర్ సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు
_ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీమన్నారాయణ రెడ్డి మునిసిపాలిటీ చైర్మన్ మాచనురు చంద్ర, మదీనా దస్తగిరి,రామ గోవిందరెడ్డి, వీరనారాయణరెడ్డి,గుడిపాడు బాబు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి,మహబూబ్ షరీఫ్,కిరణ్మయి,రఘురామిరెడ్డి,ఏవి సుబ్బారెడ్డి,లింగన్న,గల్లా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.