మనభారత్ న్యూస్ /మైదుకూరు
మైదుకూరు టౌన్ ప్రొద్దుటూరు రోడ్డులో శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి యూత్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు .ఈ సందర్బముగా వారు ఎండలు అధికంగా ఉండడం వలన చల్లని తాగు నీరు ప్రజలకు అందించాలన్న ఉద్దేశ్యం తో ఏర్పాటు చేశామన్నారు . శ్రీరామనవమి పండగ సందర్భంగా చలివేంద్రం ప్రారంభం అనంతరం పానకం ,వడపప్పు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సునీల్. సత్య. చిన్ని.చంటి. సిద్దయ్య. నాగేంద్ర. అంజి. కిషోర్.మరియుమాధవరాయ స్వామి యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు