ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల హక్కుల కోసం భాజపా నిరంతరం పోరాటం చేస్తుందని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడం వల్ల ప్రజల్లో మార్పు మొదలైందని భారతీయ జనతా పార్టీ కిసాన్మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి అన్నారు మైదుకూరు బిజెపి కార్యాలయంలో బిజెపి నేత మాచునూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కుటుంబ పార్టీల దోపిడీని అరికట్టాలన్నారు .వాటి వల్ల అభివృద్ధి జరగడం లేదన్నారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బిజెపిది అన్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం పోలీసులతో అణగదొక్కేలా చేస్తున్నారన్నారు .బిజెపికి ప్రజల అండ ఉందన్నారు. అధికార పార్టీ నేతలు ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారన్నారు. బ్రహ్మంగారి మఠం, బద్వేల్ మండలాల్లో భూ అక్రమాలు భారీ ఎత్తున జరిగాయని వాటిపైన రాష్ట్రస్థాయి అధికారులతో విచారణ చేయాలని, లేనియెడల భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి అంకాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరి ,ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి ,లక్ష్మీ దేవమ్మ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మండల అధ్యక్షులు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పేద ప్రజల హక్కుల కోసం భాజపా నిరంతరం పోరాటం చేస్తుంది .. బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి
RELATED ARTICLES