మన భారత్ న్యూస్…
ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన విద్య అందిస్తున్నాం అంటున్న ప్రభుత్వ మాటలు భూటకాలే అని విద్యార్థుల తల్లిదండ్రులు మండీ పడుతున్నారు. బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని మల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేశారని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులు అమరావతి బియ్యం రాక పోవడం వల్ల నిలిపివేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మండల విద్యాశాఖ అధికారి సైతం పట్టించుకోవడం లేదు అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. 300 మంది విద్యార్థులు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.