భారత్ న్యూస్/మైదుకూరు
మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్ ఓం శాంతి నగర్ లో బ్రహ్మకుమారీస్ ఓంశాంతి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగానిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు కళల పరిపూర్ణావతారమైన శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన పుణ్యదినం శ్రీకృష్ణ జన్మాష్టమి అన్నారు. ఈ రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు నశించి, చతుర్విధ పురుషార్థాలు సిద్ధించడమే కాక మహా జయములు కలుగుతాయని స్కాంద పురాణములో చెప్పబడింది. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీ కృష్ణుని పూజించాలి. శ్రీ కృష్ణునకు ప్రీతికరమైన ఆవు పాలు, వెన్న, మీగడ, పండ్లు మొదలైన వాటితో నైవేద్యం సమర్పించాలి. పూజ అయిన తరువాత నమస్తుభ్యం జగన్నాథ దేవకీతనయ ప్రభో, వసుదేవాత్మజ అనంత త్రాహి మాం భవసాగరాత్” అని ప్రార్థించి మోకాళ్ళపై కూర్చుని గంధం, అక్షతలు, పువ్వులు కలిపిన నారికేళజలముతో “జాతః కంసవధార్థాయ భూభారోత్తారణాయ చ, కౌరవాణాం వినాశాయ దైత్యానాం నిధనాయ చ, గృహాణార్ఘ్యం మయా దత్తం దేవక్యా సహితో హరే”అంటూ అర్ఘ్యం సమర్పించవలెను. అంతే కాక వెండితో చేసిన చంద్రబింబాన్ని శుద్ధిగానున్న పాత్రలోనుంచి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలని పురాణములో చెప్పబడింది. అని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఓం శాంతి సభ్యులు పాల్గొన్నారు.