
మైదుకూరు మండలం జి. వి.సత్రం లో వైసీపీ మైదుకూరు ఉప మండల అధ్యక్షుడు రఘునాథ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రఘునాథరెడ్డి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మాచనూరు జడ్పిటిసి గోవిందరెడ్డి, మైదుకూరు జడ్పిటిసి భర్త సుబ్బారెడ్డి ,బండి ప్రసాద్,ఇంతియాజ్,శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.