తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బందు పథకం మాదిరిగానే వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు శుక్రవారం మోతే మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకంలో దివ్యాంగులకు 25 శాతం అదనంగా చెల్లించాలని వికలాంగుల సాధికారత సమగ్రాభివృద్ధి కోసం వికలాంగుల బంధు పథకాన్ని ప్రవేశ పెట్టాలని వికలాంగుల బంధు పథకం సాధనకోసం త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన్నట్లు తెలిపిన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సమాజంలో అత్యంత వెనుకబడిన వికలాంగుల సమాజం దుర్భర జీవితాలు గడుపుతుందనీ వికలాంగుల సంక్షేమం అంటూ ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతూ వికలాంగుల సంక్షేమాన్ని పత్రికల్లో ప్రచురణకే పరిమితం చేసి వికలాంగుల సంక్షేమాన్ని అన్ని ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు విస్మరించాయని అని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక వికలాంగుల బందు పథకాన్ని ప్రవేశపెట్టాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అర్హులైన వికలాంగులకు మొదటిగా ప్రాధాన్యత ఇచ్చిఎంపిక చేయాలని 2018 నుంచి పెండింగులో ఉన్న నూతన ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలనీ కేంద్ర ప్రభుత్వం 2016 లో తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో 100 శాతం ఆసరా పింఛన్ వచ్చే వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సొంత స్థలం ఉన్న వికలాంగులకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం పది లక్షలు ఇవ్వాలని వికలాంగుల సంక్షేమ శాఖ ను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా కొనసాగించాలని ప్రభుత్వం మోడల్ మార్కెట్లలో షాపుల కేటాయింపుల్లో 5 శాతం వికలాంగులకు కేటాయించాలనీ ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు ప్రత్యేక జాబ్ కార్డులు ఇచ్చి 150 రోజులు పని దినాలు కల్పించాలనీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగులకు ప్రత్యేకంగా ర్యాంపులు నిర్మించాలని ప్రతి నెల సదరం క్యాంపులు నిర్వహించాలని 21రకాల వైకల్యాల ప్రకారం వైకాల్య ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ఈదయ్య బాబు జిల్లా ఉపాధ్యక్షుడు మున్న మధు యాదవ్ జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు జంజీరాల సుధాకర్ సంఘం మండల అధ్యక్షులు పిడమర్తి సైదులు మహిళా నాయకురాలు తురక నాగమ్మ మట్టేపల్లి పుల్లమ్మ భూక్య సరిత తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల బంధు పథకం ప్రకటించాలి:గిద్దె రాజేష్
RELATED ARTICLES