భారత్ న్యూస్/మైదుకూరు
మైదుకూరు పట్టణంలోని డిసీసీ బ్యాంకులో గత నాలుగు రోజులుగా నెట్వర్క్ పనిచేయకపోవడంతో లావాదేవీలు నిలిచి పోయాయి.పంటలు వేసుకునే కాలం కావడంతో రైతులు ఇక్కట్లకు గురవుతున్నారు. పంటల నష్టపరిహారం ,రైతు భరోసా, పిఎం కిసాన్ డబ్బులు రైతుల ఖాతా లో జమ అయ్యాయి. రైతుల ఖాతాల్లో డబ్బులు విత్ డ్రా చేసుకునేందుకు డీసీసీబీ బ్యాంకు చుట్టూ నాలుగు రోజులుగా తిరుగుతున్నామని బ్యాంక్ సిబ్బంది కంప్యూటర్ లు పని చేయడం లేదని వెనక్కు పంపిస్తున్నారు అని రైతులు వాపోతున్నారు.బ్యాంకు అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు.